ఈ రోజు అన్నీ దిన పత్రికలలో ఇన్ని సం||లుగా తెలంగాణ గురించి మాట్లాడని చంద్ర బాబు ప్రత్యేక తెలంగాణ గురించి మేము వ్యతిరేకం కాదని ప్రకటించారు. ఇంత వరకు బాగానే వుంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుతున్న మాట నిజమే, కాని తన రాష్త్ర పర్యటనలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజల మెజారిటి అభిప్రాయం ప్రకారం ప్రత్యేక తెలంగాణ పై ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఐతే 9 కోట్ల ఆంధ్ర జనాభాలో 3 కోట్ల మంది తెలంగాణ ప్రజల కన్న 6 కోట్ల మంది ఆంధ్ర, రాయలసీమల ప్రజలు సమైక్య ఆంధ్ర కోరుతుంటే మెజారిటి అభిప్రాయం ప్రకారం ప్రకటన అనడం ఎవరిని మభ్య పెట్టడానికి? జారుకుంటున్న మీ తెలంగాణ నాయకులను నిలుపుకోవడానికా? ప్రకటించిన ఉప ఎన్నికలలో లబ్ధి పొందడానికా? మొదటి నుండి ప్రత్యేక తెలంగాణ అనే వాళ్ళు అదే మాట పై ఉన్నారు. మీరు మొదటి నుండి సమైక్య ఆంధ్ర అన్నారు. చివరి దాక దానికే కట్టుబడి ఉంటె ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు చంద్ర బబూ.